There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద శక్తి వనరుల వినియోగ దేశంగా ఉన్నప్పటికీ, తన చమురు అవసరాలలో 85% దిగుమతులపై ఆధారపడడమే కాక విద్యుత్ ఉత్పత్తిలో 70% బొగ్గును ఉపయోగిస్తుంది. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న డిమాండ్, మరియు ప్రాచీన మౌలిక సదుపాయాలు నిరంతర శక్తి సంక్షోభాన్ని సృష్టించాయి. ప్రపంచ ధరల ఆటంకాలు మరియు పర్యావరణ మార్పుల వల్ల, ఈ సంక్షోభం దీర్ఘకాలికంగా కొనసాగకుండా ఉండడం కోసం మరియు పునరుత్పాదక శక్తి వ్యవస్థల వైపు తక్షణ మార్పును కోరుతోంది.
విషయం:
A. భారతదేశ శక్తి వనరుల సంక్షోభం యొక్క లక్షణాలు
1. సరఫరా-డిమాండ్ లలో అసమతుల్యత:
-2023లో భారతదేశ విద్యుత్ డిమాండ్ 240 గిగావాట్‌లను అధిగమించింది. అయితే అసమర్థమైన మౌలిక సదుపాయాలు మరియు ఇంధన కొరత వల్ల గరిష్ఠ సరఫరా వెనుకబడి ఉంది.
2. బొగ్గు ఆధారితం:
-విద్యుత్ ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ బొగ్గు నుండే తయారవుతుంది. ఇది తక్కువ ఉష్ణం మరియు అధిక బూడిద కలిగి ఉండటం వల్ల ఉద్గారాలను పెంచి, కాలుష్యాన్ని సృష్టిస్తుంది.
3. దిగుమతిపై ఆధారపడడం:
-చమురులో 85% మరియు సహజ వాయువులో 50% దిగుమతి చేయబడుతుంది. ఇది భారతదేశాన్ని ప్రపంచ ధరల హెచ్చుతగ్గులకు గురిచేస్తుంది.
4. పంపిణీ నష్టాలు:
-కొన్ని రాష్ట్రాల్లో సాంకేతిక మరియు వాణిజ్య నష్టాలు (AT&C) 20% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ రంగంపై గల విశ్వసనీయతను బలహీనపరుస్తుంది.
5. పర్యావరణ ప్రభావం:
-గనుల తవ్వకం, రవాణా, మరియు శిలాజ ఇంధనాల దహనం వాయు కాలుష్యం, భూమి క్షీణత, మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయి. ఇవి వాతావరణ లక్ష్యాలను దెబ్బతీస్తాయి.
B. సంక్షోభ పరిష్కారంలో అసాంప్రదాయిక శక్తి వనరుల పాత్ర
1. వనరుల సమృద్ధి:
-భారతదేశంలో సంవత్సరానికి 300 కంటే ఎక్కువ సౌర దినాలు, విస్తృత వాయు కారిడార్‌లు (ఉదా., తమిళనాడు, గుజరాత్) ఉన్నాయి. దీని ద్వారా సౌర శక్తి నుండి 750 గిగావాట్లు మరియు వాయు శక్తి నుండి 300 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
2. వికేంద్రీకృత ప్రాప్యత:
-సౌర పలకలు, బయోమాస్ ప్లాంట్లు, మరియు మినీ-గ్రిడ్‌లు గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో విద్యుత్ లోటును తగ్గిస్తాయి. 3.వాతావరణ స్థిరత్వం:
-శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడం అనేది 7వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం (సరసమైన & శుభ్రమైన శక్తి) మరియు పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.
4. ఉపాధి సృష్టి:
-సౌర మరియు వాయు రంగాలు బొగ్గు ఆధారిత విద్యుత్ కంటే ఒక మెగావాట్ కు మూడు రెట్లు ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తాయి. 5. విదేశీ పెట్టుబడులు:
-పునరుత్పాదక శక్తి పెట్టుబడుల్లో భారతదేశం మొదటి మూడు స్థానాల్లో ఉంది. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు సాంకేతిక బదిలీని ఆకర్షిస్తోంది.
C. అసాంప్రదాయిక వనరుల సమర్థవంతమైన ఉపయోగం కోసం చర్యలు
1. గ్రిడ్ ల ఆధునీకరణ:
-గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ల ద్వారా పంపిణీని బలోపేతం చేయడం, స్మార్ట్ మీటరింగ్, మరియు శక్తి నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా పునరుత్పాదక శక్తి యొక్క అస్థిరతను నిర్వహించడం.
2. విధాన సహకారం:
-PM-KUSUM, సౌర మాడ్యూల్‌ల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం మరియు పునరుత్పాదక శక్తి ప్రమాణ బాధ్యతల వంటి పథకాల విస్తరణ.
3. ఆర్థిక ప్రోత్సాహకాలు:
-వడ్డీ సబ్సిడీ, పన్ను రాయితీలు వంటి వాటి ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా చేయడం.
4. స్థానికీకరణ & పరిశోధన:
-ఆత్మనిర్భర్ భారత్ కింద PV సెల్స్, గాలి టర్బైన్లు, మరియు బ్యాటరీ సాంకేతికతల స్వదేశీ తయారీని ప్రోత్సహించడం.
5. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం:
-సౌర-వాయు-నిల్వల హైబ్రిడ్ పార్కులు, సముద్రతీరా గాలి మరియు పరిశ్రమల నుండి వెలువడే కార్బన్డై ఆక్సిడ్ ఉత్కారాలను తగ్గించడం కోసం హరిత హైడ్రోజన్‌ల సహకారం.
ముగింపు
భారతదేశం యొక్క శక్తి వనరుల సంక్షోభం అనేది ప్రపంచ హరిత పరివర్తనకు నాయకత్వం వహించే అవకాశాన్ని అందిస్తుంది. 175 గిగావాట్ల కంటే ఎక్కువ పునరుత్పాదక సామర్థ్యంతో మరియు 2030 నాటికి 500 గిగావాట్ లక్ష్యంతో, భారతదేశం శుద్ద శక్తి కేంద్రంగా ఉద్భవించే స్థానంలో ఉంది. సౌర, వాయు, హైడ్రోజన్ నిల్వలను స్మార్ట్ గ్రిడ్‌లు, స్థానిక నమూనాలు, మరియు విధాన సహకారం ద్వారా విస్తరించడంతో 21వ శతాబ్దంలో శక్తి వనరుల భద్రత, స్థిరత్వం, మరియు వాతావరణ స్థిరత్వాన్ని అందించింది.