TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

 Tue May 13, 2025 

Q: ఆధునిక భారతదేశంలో కుల వ్యతిరేక, Q: ఆధునిక భారతదేశంలో కుల వ్యతిరేక, దళిత మరియు బ్రాహ్మణేతర ఉద్యమాల ఆవిర్భావం మరియు లక్షణాలను విశ్లేషించండి.

పరిచయం:
బ్రిటిషు వారు అమలు చేసిన “విభజించి పాలించు” విధానం తరచుగా విమర్శల పాలైనప్పటికీ, ఆంగ్లేయులు ఈ నేలపై అడుగుపెట్టకముందే కుల వ్యవస్థ లాంటి సామాజిక విభజనలు భారత సమాజాన్ని చీల్చివేసాయి. అట్టడుగు నిమ్న వర్గాలు ఎదుర్కొన్న ఈ సామాజిక అసమానతలు బలమైన కుల-వ్యతిరేక, దళిత, మరియు బ్రాహ్మణేతర ఉద్యమాలకు దారితీశాయి. ఈ ఉద్యమాలు గౌరవం, సమానత్వం, మరియు సామాజిక సంస్కరణలను డిమాండ్ చేశాయి.

విషయం:
కుల-వ్యతిరేక
, దళిత, మరియు బ్రాహ్మణేతర ఉద్యమాలు - ముఖ్య లక్షణాలు

కుల-వ్యతిరేక ఉద్యమాలు


          దళిత ఉద్యమాలు
బ్రాహ్మణేతర ఉద్యమాలు
  • బ్రాహ్మణ ఆధిపత్యం మరియు కుల వ్యవస్థను సవాలు చేసాయి.
  • విద్య మరియు తార్కిక ఆలోచనలను ప్రోత్సహించాయి. (ఫూలే, పెరియార్).
  • అస్పృశ్యత మరియు సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాయి.
  • కులాంతర భోజనాలు మరియు వివాహాలను ప్రోత్సహించాయి.
  • సాంఘిక సంస్కరణ సంస్థల స్థాపన (ఉదా., సత్యశోధక సమాజం).

  • పౌర హక్కుల కోసం పోరాటం (ఉదా., మహద్ సత్యాగ్రహం, దేవాలయ ప్రవేశం).
  • హిందూ మతాన్ని తిరస్కరణ , బౌద్ధమత స్వీకరణ (అంబేద్కర్, 1956).
  • ప్రజా చైతన్యానికి పత్రికలను ఉపయోగించడం (ఉదా., మూక్‌నాయక్ పత్రిక).
  • రాజకీయ సంస్థల ఏర్పాటు (ఉదా., షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్).
చట్టపరమైన మరియు సామాజిక సమానత్వాన్ని డిమాండ్ చేశాయి.
  • పరిపాలన మరియు మత కార్యకలాపాలలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాయి.
  • సామాజిక సంస్కరణలను ప్రోత్సహించాయి (ఉదా., ఆత్మ-గౌరవ ఉద్యమం).
  • సంక్షేమం మరియు రిజర్వేషన్లను సమర్థించాయి (ఉదా., షాహు మహారాజ్).
  • సమానత్వం కోసం మత సంస్కరణలను చేపట్టాయి (ఉదా., నారాయణ గురు ద్వారా SNDP).
ప్రజలందరి గౌరవం మరియు ఉన్నతికి పాటు పడ్డాయి.

కుల-వ్యతిరేక, దళిత, మరియు బ్రాహ్మణేతర ఉద్యమాలు - ప్రధాన కారణాలు
1. ఆధునికత:
-
బ్రిటిషు పాలనా కాలంలో పాశ్చాత్య విద్య, రైల్వేలు, ముద్రణా యంత్రాలు, మరియు ఉదారవాద భావాల వ్యాప్తి కుల వ్యవస్థలోని అన్యాయాలను బయటపెడుతూ సామాజిక సంస్కరణ మరియు కుల-వ్యతిరేక ఉద్యమాలకు కారణమయ్యాయి.
2. పునరుజ్జీవనయుగం - సామాజిక చైతన్యం:
-
జ్యోతిరావు ఫూలే, నారాయణ గురు, మరియు డాక్టర్ అంబేద్కర్ వంటి నాయకులు కుల వ్యవస్థ యొక్క మతపరమైన మరియు సైద్ధాంతిక పునాదులను సవాలు చేస్తూ అస్పృశ్యత నిర్మూలన మరియు సామాజిక సంస్కరణలకు పిలుపునిచ్చారు.
3. సామాజిక బహిష్కరణ:
-
దళితులు చారిత్రకంగా సార్వజనిక స్థలాలు, విద్య, మరియు దేవాలయాల నుండి బహిష్కరించబడుతుండడంతో, ప్రాథమిక హక్కులు మరియు సామాజిక సమానత్వం కోసం పోరాట ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి.
4. రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం:
-
దళితులు మరియు వెనుకబడిన కులాలకు జాతీయ ఉద్యమంలో మరియు రాజకీయ చర్చలలో ప్రాతినిధ్యం లభించలేదు. ఇది సాధికారత మరియు సామాజిక న్యాయంపై దృష్టి సారించిన ప్రత్యామ్నాయ ఉద్యమాలకు కారణమైంది.
5. సాహిత్యం యొక్క పాత్ర:
-
కుల-వ్యతిరేక పత్రికలు మరియు దళిత సాహిత్య రచనలు, సమానత్వం మరియు సామాజిక న్యాయం లాంటి ఉన్నత భావాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా, దళిత మరియు బ్రాహ్మణేతర ఉద్యమాలకు సైద్ధాంతిక, ప్రజా మద్దతును అందించడంలో సహాయపడ్డాయి.
ప్రధాన ఉద్యమాలు మరియు నాయకులు
1. సత్యశోధక్ సమాజ్ (1873) – కుల-వ్యతిరేక ఉద్యమం
-
జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేసి, సమానత్వాన్ని ప్రోత్సహించింది. అంతేకాకుండా శూద్రులు మరియు మహిళలకు విద్యను అందించాలని డిమాండ్ చేస్తూ, వేదాల ఆధిపత్యాన్ని తిరస్కరించింది. అంబేద్కర్‌తో సహా భవిష్యత్ దళిత మరియు బ్రాహ్మణేతర నాయకులకు ప్రేరణగా నిలిచింది.
2. అంబేద్కరైట్ ఉద్యమం – దళిత ఉద్యమం
-
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో, ఈ ఉద్యమం దళితులకు రాజకీయ హక్కులు, విద్య, మరియు సామాజిక గౌరవాన్ని సాధించడంపై దృష్టి సారించింది. అంబేద్కర్ మహద్ సత్యాగ్రహం (1927) మరియు కలరం దేవాలయ సత్యాగ్రహం (1930) వంటి కీలక ఉద్యమాలను నడిపించారు. పూనా ఒప్పందం (1932) దళితులకు శాసనసభల్లో రిజర్వ్‌డ్ సీట్లను సాధించింది.
3. జస్టిస్ పార్టీ (1916) – బ్రాహ్మణేతర ఉద్యమం
-
మద్రాస్‌లో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ స్థాపించబడిన జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రజా కార్యాలయాల్లో రిజర్వేషన్లను సమర్థించింది. 1920లలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి పార్టీగా నిలిచి, ద్రావిడ రాజకీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
4. ఆత్మ-గౌరవ ఉద్యమం (1925)
-
తమిళనాడులో పెరియార్ ఇ.వి. రామస్వామి మొదలుపెట్టిన ఈ ఉద్యమం తార్కికత, నాస్తికత, మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించింది. బ్రాహ్మణ సంప్రదాయాన్ని తిరస్కరిస్తూ, కులాంతర వివాహాలను సమర్థించడమేగాక హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది. అంతేకాకుండా ఈ ఉద్యమం DMK వంటి ద్రావిడ రాజకీయ పార్టీల స్థాపనకు ప్రేరణనిచ్చింది.
5.దళిత్ పాంథర్స్ (1972)
-
అమెరికాలోని బ్లాక్ పాంథర్ పార్టీ స్ఫూర్తితో, మహారాష్ట్రలో దళిత్ పాంథర్స్ అనే సంస్థ కుల హింస మరియు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమయ్యింది. సాహిత్యం, కళ, మరియు నిరసనల ద్వారా దళిత సాధికారతను సాధించే ప్రయత్నం చేయడమేగాక వారి మానిఫెస్టో భూసంస్కరణలు మరియు దళితులకు పౌర హక్కుల కోసం పిలుపునిచ్చింది.

ముగింపు:
ఈ ఉద్యమాలు శతాబ్దాల నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ, ఆత్మ గౌరవం, సమానత్వం, మరియు సామాజిక న్యాయ సాధనలో కీలక పాత్ర పోషించడమేగాక ఇప్పటికీ భారతదేశ సామాజిక నిర్మాణం మరియు రాజకీయ పరిణామాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి.

Additional Embellishment: