There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
1960వ దశకంలో డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్ నేతృత్వంలో ప్రారంభమైన హరిత విప్లవం భారత వ్యవసాయంలో ఒక పెను మార్పును తీసుకొచ్చింది. ఈ విప్లవానికి ముందు హెక్టారుకు సుమారు 850 కిలోలు గల గోధుమ దిగుబడి 200% కంటే ఎక్కువగా పెరిగి 2,600 కిలోలకు పైగా చేరుకుంది. నీటిపారుదల సౌకర్యాలు మరియు ఉన్నత దిగుబడి గల విత్తనాల సహాయంతో ఈ పురోగతి సాధ్యమైంది.
విషయం:
ఎ. సానుకూల ప్రభావాలు:
1. ఆహార స్వావలంబన సాధన:
-దాన్యాల ఉత్పత్తి 1960లో 82 మిలియన్ టన్నుల నుండి 2000 నాటికి 250 మిలియన్ టన్నులకు పైగా పెరిగింది.
2. సాంకేతిక ఆధునికీకరణ:
-యాంత్రీకృత వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థలు, మరియు ఉన్నత దిగుబడి విత్తనాల (HYV) విస్తరణ జరిగింది.
3. కరువు సంఘటనల తగ్గింపు:
-భారతదేశం ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించి, దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గింది.
4. వ్యవసాయ ఆదాయం పెరుగుదల:
-పంజాబ్, హర్యానా, మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లోని రైతులు గణనీయమైన లాభాలు పొందారు.
5. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పునాది:
-ఎరువులు, కీటకనాశినులు, ట్రాక్టర్ తయారీ వంటి రంగాల వృద్ధి జరిగింది.
బి. ప్రతికూల ప్రభావాలు:
1. ప్రాంతీయ అసమానతలు:
-ఈ విప్లవం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో ఆ ప్రాంతాలలోనే వృద్ధి జరిగింది. కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో ఆ ప్రాంతాలలోనే వృద్ధి జరిగింది. కొన్ని ప్రాంతాలకే తూర్పు మరియు వర్షాధార ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.
2. పర్యావరణ క్షీణత:
-భూగర్భ జలాల అతి వినియోగం, నేలలో లవణాల స్థాయి పెరిగి నేల సారం అధిక మొత్తంలో తగ్గింది.
3.ఏకవిధ పంటల పోకడ:
-వరి మరియు గోధుమలపై అధిక దృష్టి కారణంగా పంటల వైవిధ్యం తగ్గింది.
4. సామాజిక అసమానతలు:
-పెద్ద రైతులు లాభాలు పొందగా, చిన్న మరియు సన్నకారు రైతులు వెనుకబడ్డారు.
5. పర్యావరణ కాలుష్యం:
-అధిక ఎరువులు మరియు కీటకనాశినుల వాడకం వల్ల నేల, నీరు కలుషితమై, జీవవైవిధ్యం దెబ్బతిన్నది.
భారతదేశంలో వ్యవసాయ పద్ధతులపై ప్రభావాలు:
1. ఏకవిధ పంటలకు మార్పు:
-రైతులు సాంప్రదాయ పంటల వైవిధ్యాన్ని విడిచిపెట్టి, ఎక్కువగా గోధుమలు మరియు వరి సాగు చేయడం ప్రారంభించారు. దీనివల్ల చిరుధాన్యాలు, జొన్నలు, నూనె గింజల సాగు తగ్గి, పోషకాల భద్రత మరియు నేల సారం వంటివి ప్రభావితమయ్యాయి. 2. వ్యవసాయ యాంత్రీకరణ:
-ట్రాక్టర్లు, కోత యంత్రాలు, మరియు పంప్ సెట్ల వినియోగం, ముఖ్యంగా హరిత విప్లవ ప్రాంతాల్లో, విస్తృతమైంది. దీనివల్ల కూలీలపై ఆధారపడే అవసరం తగ్గి, కార్యాచరణ సామర్థ్యం పెరిగింది.
3. సబ్సిడీలపై ఆధారపడడం:
-రసాయన-ఆధారిత పద్ధతుల కారణంగా భారత వ్యవసాయం ఎరువులు, కీటకనాశినులు, మరియు విద్యుత్ సబ్సిడీలపై ఆధారపడింది. దీర్ఘకాలంలో ఇది స్థిరత్వాన్ని కోల్పోయింది.
4. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ:
-వాయవ్య భారతదేశంలో గొట్టపు బావులు మరియు కాలువల ద్వారా నీటిపారుదల వేగంగా పెరిగింది. దీంతో వర్షాధార వ్యవసాయ పద్ధతులు కనుమరుగయ్యాయి.
5. ఎడారి ప్రాంతాలు మరియు వర్షాధార ప్రాంతాలపై అశ్రద్ధ:
-భారతదేశంలో 60% కంటే ఎక్కువ వర్షాధార వ్యవసాయ భూమి హరిత విప్లవం ద్వారా తక్కువ ప్రయోజనాన్ని పొందింది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో దిగుబడులు తక్కువగా ఉండి, అభివృద్ధి వెనుకబడింది.
ముగింపు:
హరిత విప్లవం భారతదేశ ఆహార భద్రతను పెంచినప్పటికీ, పర్యావరణ బలహీనతలను బహిర్గతం చేసింది. ఎం.ఎస్. స్వామినాథన్ ఊహించిన "పర్యావరణ హాని లేకుండా శాశ్వత ఉత్పాదకత" లక్ష్యంతో నిరంతర హరిత విప్లవాన్ని స్వీకరించడమే ప్రస్తుతం మన ముందున్న మార్గం. నేల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం, వాతావరణ అనుకూలమైన శీఘ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ వ్యవసాయ వృద్ధిని కొనసాగించాలి.