There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Thu Apr 10, 2025
పరిచయం:
1798లో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పంద వ్యవస్థ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు సైనిక ఆధిపత్యాన్ని స్థాపించడంలో ఒక వ్యూహాత్మక సాధనంగా పనిచేసింది. ఈ వ్యవస్థ ఒక వైపు బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు భారతీయ రాజ్యాల విచ్చిన్నానికి కారణమయింది.
విషయం:
భారతదేశంలో బ్రిటిష్ నియంత్రణ బలపడటంలో సైన్య సహాకార విధానం యొక్క పాత్ర
1) సైనిక నియంత్రణ:
· ఈ ఒప్పందం ద్వారా బ్రిటిష్ వారు భారతీయ రాజ్యాలపై ప్రత్యక్ష సైనిక ఆధిపత్యం మరియు నియంత్రణను సాధించారు. ఉదాహరణకు, హైదరాబాద్ (1798), మైసూర్, అవధ్, మరియు మరాఠా వంటి శక్తివంతమైన రాజ్యాలు ఈ వ్యవస్థలో భాగం అయ్యాయి.
2) ఆర్థిక దోపిడీ:
· సైనిక ఖర్చును భరించడం భారతీయ రాజ్యాలకు ఆర్థిక భారంగా మారింది. ఈ ఖర్చులను చెల్లించలేని పక్షంలో, స్వదేశీ రాజ్యాలు తమ భూభాగాలను బ్రిటిష్ వారికి ధారాదత్తం చేయాల్సి వచ్చేది, దీని ఫలితంగా వారి రాజ్యాలు క్రమంగా కుంచించుకుపోయాయి.3) విదేశాంగ వ్యవహారాలపై ఆంక్షలు:
· సైన్య సహకార సంధికి అంగీకరించిన స్వదేశీ రాజ్యాధినేత తన విదేశీ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని తప్పకుండా అంగీకరించిరావాల్సింది కాబట్టి కంపెనీ అనుమతి లేనిదే యుద్ధాలు, ఒడంబడికలకు తావు లేకుండా పోయింది. దానితో స్వదేశీ రాజ్యాల రాజకీయ స్వతంత్రత చాలా వరకూ పరిమితమయ్యింది.4) బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ:
· బ్రిటిషు వారు ప్రత్యక్ష తగాదాలు లేకుండానే భారతీయ రాజ్యాలను ఆక్రమించగలిగారు.
· ఉదా: మైసూరు, అవధ్ మరియు మరాఠా రాజ్యాల పాలకులను మొదటగా ఆకర్షించి తరువాత ఈ ప్రాంతాలను బ్రిటిషు సామ్రాజ్యంలో భాగం చేసారు.
ముగింపు
"వెల్లెస్లీ ప్రవేశ పెట్టిన ఈ విధానం భారతీయ పాలకుల సార్వభౌమాధికారాన్ని నాశనం చేసి, బ్రిటిష్ ఆధిపత్యానికి మార్గం సుగమం చేసింది." అంతేకాకుండా ఈ విధానం బ్రిటిష్ వారికి భారతదేశం అంతటా తమ నియంత్రణను విస్తరించే అవకాశం కల్పించి, భారతీయ రాజ్యాల రాజకీయ శక్తిని నిర్వీర్యం చేసింది. ప్రారంభంలో విజయవంతం అయినప్పటికీ, తరువాత కాలం లో తీవ్ర ప్రతిఘటనను రేకెత్తించి, 1857 భారత తిరుగుబాటు మొదలవడంలో కీలక పాత్ర పోషించింది.