There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Wed May 7, 2025
పరిచయం:
దక్కన్ ప్రాంతాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించిన ఆసఫ్‌జాహీ పాలకులు తమ పరిపాలనా నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, కళాత్మక వైభవాన్ని వారి నిర్మాణాల్లో ప్రతిబింబించారు. నిజాంల గౌరవానికి చిహ్నంగా నిలిచిన చౌమహల్లా పాలెస్ ను దీనికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ కట్టడం నీయో-క్లాసికల్, మొఘల్, పర్షియన్ మరియు స్థానిక దక్కన్ శైలి సమ్మిళితిగా నిర్మితమై ఈ కట్టడం ఆసఫ్‌జాహీ వంశానికి రాజప్రాసాదాలు, మసీదులు, పౌర నిర్మాణాలు వంటి శాశ్వత వారసత్వ నిర్మాణాలపై ఉన్న అపార ఆసక్తిని సూచిస్తుంది.
విషయం:
మూల నిర్మాణ లక్షణాలు:
1. శైలుల సమ్మేళనం:
-ఆసఫ్జాహీ శిల్ప సంపద భారతీయ-ఇస్లాం సంప్రదాయాలను కలగలిపిన సమగ్ర శైలిగా గుర్తించబడుతుంది. ఇందులో:
a. పర్షియన్ ప్రభావం: అర్చీలు, తోటల అమరికలు, కళిగ్రఫీ, పుష్పాలంకరణలు వంటివి కనిపిస్తాయి.
b. మొఘల్ ప్రభావం: ఉల్లిపాయ ఆకార గోపురాలు, మినార్లు, సమవిభజన పీఠాలు వంటివి కనిపిస్తాయి.
c. దక్కన్ శైలి: స్థానిక రాళ్ల వినియోగం, సున్నపు పూతలు, ప్రాంతీయ శిల్పకళాకారుల నైపుణ్యం ఇందులో మనం చూడవచ్చు. d. యూరోపియన్ శైలి: నీయో-క్లాసికల్ స్తంభాలు, విక్టోరియన్ అంతర్గత అలంకరణలు, పాలేడియన్ నిర్మాణ శైలి.
2. స్టుక్కో (Stucco) మరియు సున్నపు పూతల వినియోగం:
-పుష్పాలు, గణిత నమూనాలతో కూడిన స్టుక్కో పనితనం పురాని హవేలీ వంటి రాజప్రాసాదాలు, పరిపాలన భవనాల్లో చూడవచ్చు.సున్నపు పూతను అందం మరియు వాతావరణ అనుకూలత కోసం విస్తృతంగా ఉపయోగించారు.
3. ప్రసిద్ధ రాజప్రాసాదాలు మరియు కోటలు:
i. చౌమహల్లా ప్యాలెస్:
a. సలాబత్ జంగ్ ఆధ్వర్యంలో 1750లో ప్రారంభమై ఈ నిర్మాణం, అఫ్జలుద్దౌల (1857–69) కాలంలో పూర్తయ్యింది.
b. అఫ్జల్, మేహ్తాబ్, అఫ్తాబ్, తహ్నియత్ మహళ్ళను కలిగి ఉన్న ఈ సముదాయంపై ఇరాన్‌లోని షాహీ ప్యాలెస్ ప్రభావం ఉంది. c. 250 ఏళ్ల నాటి ఖిల్వత్ గడియారము ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
ii. ఫలక్నుమా ప్యాలెస్:
a. 1884–1893 మధ్య సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించిన ఈ ప్యాలెస్ స్కార్పియన్ ఆకారంలో ఉండి, ఆండ్రియా పాలేడియన్ శైలిని అనుసరిస్తుంది.
b. బ్రిటీష్ ఆర్కిటెక్ట్ విలియం వార్డ్ మారెట్ దీనికి డిజైన్ చేసి, ఇటాలియన్ మార్బుల్, ఇంగ్లీష్ వుడ్, యూరోపియన్ అంతర్గత అలంకరణలతో ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు.
iii. హిల్ ఫోర్ట్ ప్యాలెస్:
-నిజామత్ జంగ్ 1923లో నిర్మించి, తరువాత తన కుమారుడు మౌజంజాకు ఇచ్చాడు. ట్రినిటీ కాలేజీ (కేంబ్రిడ్జ్) నిర్మాణ శైలిని అనుసరించిన ఈ భవనం యూరోపియన్ విద్యా నిర్మాణకళను ప్రతిబింబిస్తుంది.
iv. బెల్లా విస్టా ప్యాలెస్:
-న్యాయమూర్తి ముస్లేహుద్దీన్ మహ్మద్ ఈ ప్యాలెస్ (1905) ను నిర్మించారు. ‘బెల్లా విస్టా’ అంటే ఇటాలియన్ భాషలో "సుందర దృశ్యం" అని అర్థం. ప్రస్తుతం దీనిని భారత పరిపాలన శిక్షణ కాలేజీగా వినియోగిస్తున్నారు.
v. పురాని హవేలీ:
-నిజాం అలీ ఖాన్ తన కుమారుడు సికందర్ జా కోసం నిర్మించిన ఈ భవనాన్ని మసరత్ మహల్ అని కూడా పిలుస్తారు. ఇది యూరోపియన్ ప్రభావంతో రూపొందిన U-ఆకార నిర్మాణం. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద కలప తలుపుల అల్మారీ ఉంది. తెలంగాణ సాంస్కృతిక స్వరూపంలో ప్రాముఖ్యత:
1. మిళిత వారసత్వానికి ప్రతీక:
-ఫలక్‌నుమా, చౌమహల్లా వంటి కట్టడాల్లో ఇస్లామిక్, పర్షియన్, యూరోపియన్ శైలుల సమ్మేళనం తెలంగాణలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మత, సాంస్కృతిక సహజీవన సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ అంశాన్ని "హైదరాబాదు హెరిటేజ్ వీక్" వంటి కార్యక్రమాలలో ఘనంగా ప్రదర్శిస్తారు.
2. పర్యాటక ప్రాతినిధ్యం:
-ఫలక్‌నుమా ప్యాలెస్ తాజ్ గ్రూప్ ద్వారా హరిటేజ్ హోటల్‌గా పునర్నిర్మించబడింది. 2017 గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ఇవాంకా ట్రంప్ వంటి ప్రముఖులు ఇక్కడ ఆతిథ్యం పొందారు.
-చౌమహల్లా ప్యాలెస్ సందర్శకుల ఆకర్షణగా నిలిచి, నిజాం కాలపు వస్తువులు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఎప్పుడు సందర్శకులతో నిండి ఉంటుంది.
3. ప్రతిష్టాత్మక సంస్థల పరంపర:
-బెల్లా విస్టా ప్యాలెస్ నేడు ఆధునిక పరిపాలనా శిక్షణా కేంద్రంగా నిలిచింది.
-నిజాం పాలనలో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణలో ఉన్నత విద్యకు ప్రాతినిధ్యంగా నిలుస్తోంది.
4. చలనచిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత:
-ఈ కట్టడాలు టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలలో తరచుగా ప్రత్యక్షమవడం ద్వారా ప్రజల ఊహా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.
5. హైదరాబాదీ జీవన విధానంలో భాగస్వామ్యం:
-రంజాన్, బోనాలు వంటి పండుగల సందర్భంగా స్థానికులు ఈ వారసత్వ కట్టడాల చుట్టూ ఒకటై సమాజిక, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తారు.
ముగింపు
ఆసఫ్‌జాహీ పాలకుల నిర్మాణ దృష్టి తెలంగాణ సాంస్కృతిక ఐక్యతకు నేటికీ ఆధారస్థంభంగా నిలుస్తోంది. ఇటీవల నిర్మితమైన డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం – దీనిలో ఇండో-సరాసెనిక్, ఇండో-ఇస్లామిక్ శైలి ప్రభావాలు స్పష్టంగా కనిపించడం ఆసఫ్‌జాహీ నిర్మాణ కళా వారసత్వం హైదరాబాద్ నగర శిల్పరచనలో ఇంకా జీవిస్తుంది అన్న దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
Embellishment