There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Tue Jul 1, 2025
పరిచయం:
భారతదేశంలో పట్టణ మరియు గ్రామీణాభివృద్ధి అనేది వివిధ సంస్థలు మరియు కార్యక్రమాల సమన్వయం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ సమన్వయానికి ఒక ఉదాహరణ—గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్- కింద 100 మిలియన్లకు పైగా శౌచాలయాలు నిర్మించబడ్డాయి మరియు గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత (ODF) గ్రామాలుగా మారేలా ప్రోత్సహించబడ్డాయి అదే సమయంలో పట్టణ స్వచ్ఛభారత్ మిషన్ పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించింది. ఈ విధానమైన ఏకీకృత ప్రణాళికల వలన సంస్థాగత సమన్వయాన్ని పెంపొందించి, పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించి, సమగ్ర అభివృద్ధిని సాధిస్తుంది.
విషయం:
పట్టణాభివృద్ధి సంస్థలు మరియు కార్యక్రమాలు:
1. గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు విధాన రూపకల్పన, ఆర్థిక సహాయం మరియు అమలు కోసం ఏర్పాటైన అత్యున్నత సంస్థ.
a. స్మార్ట్ సిటీస్ మిషన్ (2015)
1. 100 నగరాలను స్మార్ట్ గవర్నెన్స్, సమాచార సాంకేతిక పరిష్కారాలు,-సమర్థమైన మౌలిక సదుపాయాలు మరియు పట్టణ చలనశీలత వ్యవస్థల ద్వారా అభివృద్ధి చేస్తుంది.
2. పౌరసమాజ భాగస్వామ్యం మరియు సమగ్ర ప్రణాళికను ఉత్తేజ పరుస్తుంది
b. అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (AMRUT, 2015)
1. 500 లకు పైగా నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీ, మరియు ఇంజిన్ రహిత రవాణా వంటి ప్రాథమిక పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తుంది.
2. హరిత స్థలాలు, శక్తి సామర్థ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహిస్తుంది.
c. ప్రధానమంత్రి ఆవాస్ యోజన – పట్టణ (PMAY-U, 2015)
1. క్రెడిట్ ఆధారిత సబ్సిడీ పథకం (CLSS) ద్వారా అందరికీ గృహనిర్మాణ లక్ష్యాన్ని సాధ్యం చేస్తుంది.
2. మురికివాడల పునరావాసం, పునరాభివృద్ధి మరియు వ్యక్తిగత గృహ సహాయాన్ని అందిస్తుంది.
2. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA)
జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ
-విధాన పరిశోధన, సామర్థ్య నిర్మాణం మరియు స్మార్ట్ గవర్నెన్స్ మోడళ్లను ప్రోత్సహించే ప్రముఖ పట్టణ థింక్ ట్యాంక్ ఇది.
3. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్ (TCPO)
-రాష్ట్ర మరియు ప్రాంతీయ స్థాయిలో పట్టణ ప్రణాళిక మరియు భూమి వినియోగ వ్యూహాలకు సాంకేతిక మార్గదర్శనం అందిస్తుంది.
4. పట్టణ స్థానిక సంస్థలు (ULBs)
-74వ రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణ పరిపాలన, పన్ను వసూళ్లు మరియు సేవల అందించడానికి అధికారం కలిగి ఉన్నాయి.
5. మెట్రో రైల్ కార్పొరేషన్స్
-పట్టణ రద్దీని తగ్గించడానికి మరియు స్థిరమైన చలనశీలతపై దృష్టి సారించి, మెట్రో రైలు వ్యవస్థలను అభివృద్ధి చేస్తాయి మరియు నిర్వహిస్తాయి.
గ్రామీణాభివృద్ధి సంస్థలు మరియు కార్యక్రమాలు:
1. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి ఏర్పాటుచేసిన ప్రాధికార మంత్రిత్వ శాఖ.
a. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)
1. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల వేతన ఉపాధిని చట్టబద్ధంగా హామీ చేస్తుంది.
2. నైపుణ్యం లేని మానవ శ్రమ, ఆస్తుల సృష్టి మరియు పారదర్శకత కోసం సామాజిక తనిఖీలపై దృష్టి సారిస్తుంది.
b. ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G)
1. 2024 నాటికి గ్రామీణ భారతదేశంలో అందరికీ గృహనిర్మాణ లక్ష్యాన్ని సాధ్యం చేస్తుంది.
2. శౌచాలయాలు, విద్యుత్ మరియు LPG కనెక్షన్‌లతో కూడిన పక్కా గృహాల నిర్మాణాన్ని ఈ పథకం ద్వారా అందిస్తుంది.
c. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) / DAY-NRLM
1. గ్రామీణ పేదలలో స్వయం సహాయక బృందాలను (SHGs) ప్రోత్సహిస్తుంది, స్వయం ఉపాధి మరియు ఆర్థిక చేరికను సాధిస్తుంది.
2. మైక్రోక్రెడిట్, శిక్షణ మరియు జీవనోపాధి అనుసంధానాలకు అవకాశం కల్పిస్తుంది.
d. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)
1. అననుసంధానిత గ్రామీణ నివాసాలకు అన్ని వేళల్లో అవసరమైన రహదారుల అనుసంధానాన్ని ప్రోత్సహిస్తుంది.
2. ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు మార్కెట్‌లకు ప్రవేశాన్ని మెరుగుపరుస్తుంది.
2. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)
-వ్యవసాయం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం బ్యాంకులకు రీఫైనాన్స్ సపోర్ట్ అందిస్తుంది. వాటర్‌షెడ్ అభివృద్ధిని సమర్థిస్తుంది మరియు ఉత్పాదక సంస్థలను ప్రోత్సహిస్తుంది.
3. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ (CAPART)
-గ్రామీణాభివృద్ధిలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సహాయం అందిస్తుంది. సముదాయ-నేతృత్వ ఆవిష్కరణలు మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తుంది.
4.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు (DRDAs)
-MGNREGA, PMAY-G వంటి పేదరిక నిర్మూలన మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జిల్లా స్థాయిలో అమలు విభాగాలుగా పనిచేస్తాయి.
5. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ
a. గ్రామ పంచాయతీలు73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామీణ కార్యక్రమాల అమలు, సామాజిక భాగస్వామ్యం మరియు స్థానిక ప్రణాళికను సాధికారపరుస్తాయి.
b. పంచాయతీల (షెడ్యూల్డ్ ఏరియాస్‌కు విస్తరణ) చట్టం – PESA (1996)
-షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామ సభలకు సహజ వనరుల నిర్వహణ, ఆచార విధానాలు మరియు స్థానిక అభివృద్ధిపై నిర్ణయాధికారం కల్పిస్తుంది.
సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు:
1. రూర్బన్ మిషన్ (శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ – SPMRM)
a. గ్రామీణ ప్రాంతాలను దాని స్వభావాన్ని కాపాడుతూ పట్టణ సౌకర్యాలతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.
b. డిజిటల్ అనుసంధానం, పారిశుద్ధ్యం, విద్య, గృహనిర్మాణం మరియు స్థిరమైన జీవనోపాధులతో స్మార్ట్ గ్రామ సమూహాలను సృష్టించడం ద్వారా పట్టణ-గ్రామీణ విభజనను తగ్గిస్తుంది.
2. స్వచ్ఛ భారత్ మిషన్ (SBM)
a. పట్టణ విభాగం (SBM-U)
-బహిరంగ మలవిసర్జనను నిర్మూలించడం, వ్యక్తిగత మరియు సామూహిక శౌచాలయాల నిర్మాణం, మరియు పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తుంది.
b. గ్రామీణ విభాగం (SBM-గ్రామీణ)
-గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు, ప్రవర్తనా మార్పు మరియు నీటి నిర్వహణను ప్రోత్సహిస్తుంది.
3. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY)
a. 15-35 సంవత్సరాల వయస్సు గల గ్రామీణ యువత ఉపాధి సామర్థ్యాన్ని మార్కెట్-అనుసంధానిత నైపుణ్య అభివృద్ధి మరియు ఉద్యోగ నియామకం ద్వారా మెరుగుపరుస్తుంది.
b. SC/ST, మైనారిటీలు మరియు మహిళలతో సహా అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేస్తుంది.
4. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC)
(జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ)
a. నైపుణ్య అభివృద్ధి మరియు ఉద్యోగవకాశాల మంత్రిత్వ శాఖ కింద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంగా పనిచేస్తుంది.
b. పరిశ్రమ డిమాండ్‌లను తీర్చడానికి పట్టణ మరియు గ్రామీణ జనాభాకు వృత్తి శిక్షణను సులభతరం చేస్తుంది.
ముగింపు:
పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించడానికి మరియు సమగ్ర అభివృద్ధిని సాధించడానికి వివిధ సంస్థలు మరియు కార్యక్రమాల సమన్వయ ప్రయత్నాలు అవసరం. అమలు మరియు స్థానిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా సేవలు మెరుగుపడడమే కాకుండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG 6 – శుద్ధ నీరు మరియు పారిశుద్ధ్యం, SDG 11 – స్థిరమైన నగరాలు మరియు సముదాయాలు, SDG 1 – గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన) వైపు భారతదేశం పురోగమనాన్ని సాధిస్తుంది.