TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Thu May 8, 2025

Q: ప్రాచీన తెలంగాణలో భాష, సాహిత్యం, కళ, శిల్పకళల ఆధారంగా సామాజిక-సాంస్కృతిక పరిస్థితులను విశ్లేషించండి

పరిచయం:
16 మహాజనపదాలలో ఒకటైన అస్మక రాజ్యంతో దక్కన్ ప్రాంత ప్రస్తావన మొదలయ్యింది. ఈ అస్మకరాజ్యం తెలంగాణలోని బోధన్ ప్రాంతంలో ఆవిర్భవించి, ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. అయితే "తెలంగాణ" అనే పదానికి తొలి ప్రస్తావన సంగారెడ్డి జిల్లాలో లభించిన తెల్లాపూర్ శాసనంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతం తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వంటి రాజవంశాల పాలనలో భాష, సాహిత్యం, కళా, శిల్పరంగాలలో అభివృద్ధి చెందింది.

విషయం:
A. భాష: 1. ప్రాకృతము – సామాన్య ప్రజల భాష:
a. శాతవాహనుల కాలంలో శాసనాలు, అధికార సంబంధిత విషయాల్లో ప్రాకృత భాష విస్తృతంగా ఉపయోగించారు.
b. ఇది పరిపాలనను సామాన్యులకు చేరువ చేయడాన్ని సూచిస్తుంది.
2. సంస్కృతము – కర్మకాండలు, పండితుల భాష:
a. ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమై, విష్ణుకుండినుల కాలంలో మరింత విస్తరించిన సంస్కృతం బ్రాహ్మణ సంప్రదాయాలకు ప్రధాన భాషగా మారింది.
b. ఇది శ్రామిక మరియు ప్రజల మధ్య భాషాపరమైన విభజనను సూచిస్తుంది.
3. తెలుగు భాష యొక్క ఉద్భవ సూచనలు:
a. జగయ్యపేట, ఫణిగిరి శాసనాలలో 'అడవి', 'బాపి' వంటి తెలుగు పదాలు కనిపించటం అనేది తెలుగు మాట్లాడే ప్రజల గుర్తింపును వెల్లడిస్తుంది.
b. ఇది ప్రాంతీయ గుర్తింపు యొక్క ఆరంభ సంకేతంగా అర్థం చేసుకోవచ్చు.
4. బ్రాహ్మి లిపి – సమాచార సాధనంగా:
a. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు బ్రాహ్మి లిపిని ఉపయోగించారు.
b. భూదానాలు, ధార్మిక విరాళాలు, రాజాజ్ఞలు నమోదు చేయడం వల్ల అక్షర పరిజ్ఞానం వ్యాప్తి చెందింది.
5. బహుభాషా సమన్వయం – సామాజిక బహుళత్వానికి నిదర్శనం:
a. ప్రాకృతం, సంస్కృతం, ప్రాథమిక తెలుగు భాషలు ఒకేచోట సహజీవనం సాగించాయి.
b. చిక్కుల్ల శాసనంలో 'అంబులు' అనే తెలుగు పదం ప్రయోగం, ప్రజల భాష అధికార పత్రాలలోకి ప్రవేశించిందని తెలియజేస్తుంది.
B. సాహిత్యం:
1. గాథాసప్తశతి – గ్రామీణ భావోద్వేగాలకు ప్రతిబింబం:
a. హాలుడు రచించిన గాథాసప్తశతి ప్రాకృత కవితల సమాహారం.
b. ఇందులోని చాలామంది మహిళల దృక్కోణంలో ఉన్న కావ్యాలు గ్రామీణ జీవితాన్ని తెలియజేస్తున్నాయి.
2. బృహత్కథ – జనప్రియ కథనం:
-
గుణాఢ్యుడు రచించిన బృహత్కథ ఇప్పుడు లభ్యం కాకపోయినా, తదుపరి ఈ క్రింది రచనలపై దీని ప్రభావం కనిపిస్తుంది:
a. సోమదేవసూరి – కథాసరిత్సాగరం
b. క్షేమేంద్రుడి – బృహత్కథామంజరి
c. హరిసేనుడి – బృహత్కథాకోశం
d. వరాహమిహిరుని – బృహత్సంహిత · మొదట ఇది మౌఖికంగా ప్రచారంలో ఉండి, అనంతరం సాంప్రదాయ కథనాలను రాయడంలో దోహదపడింది.
3. నాగార్జునకొండ – బౌద్ధ విజ్ఞాన కేంద్రం:
a. ఇక్ష్వాకుల పాలనలో నాగార్జునకొండ విద్యా, ధార్మిక కేంద్రమైంది.
b. ఇక్కడి పాలీ, సంస్కృత వ్యాఖ్యానాలు అన్ని కులాలవారికి నైతిక బోధనలందించేందుకు రచించారు.
4. శిల్పాలు – శాస్త్రీయ కథనాలకు ఆధారంగా:
a. అమరావతి, నాగార్జునకొండలోని శిల్పాలు జాతక కథలు, ఇతిహాసాలను కథలా చెబుతాయి.
b. ఇది అక్షరజ్ఞానం లేని ప్రజలకూ మౌలిక విలువలను బోధించేందుకు ఉపయోగపడింది.
C. కళా-శిల్పకళలు:
1. బౌద్ధ స్తూపాలు – ప్రజల ఆధ్యాత్మిక కేంద్రాలు:
a. అమరావతి, భట్టిప్రోలు, సాలిహుందంలో నిర్మిత బౌద్ధ స్తూపాలు బుద్ధుని భోదనలకు కేంద్రమయ్యాయి.
b. ఇవి ప్రజల సామూహిక ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రతిబింబించాయి.
2. సామాజిక సమన్వయ కేంద్రాలుగా ప్రధాన ప్రదేశాలు:
a. నెలకొండపల్లి, ఫణిగిరి, ధూలికట్టలు వాణిజ్యం, భక్తి, కళలకు కేంద్రబిందువులుగా నిలిచాయి.
b. ఇవి బిక్షువులు, వ్యాపారులు, కళాకారులు, భక్తులను ఒకే వేదికపై కలిపాయి.
3. ప్రజల్ని ఏకం కళా శైలులు:
-
శాతవాహనులు, ఇక్ష్వాకుల కళా నిర్మాణాలు దేవతలే కాక ప్రజల జీవితం, జంతువులు, చెట్లు, వనాలు ప్రతిబింబించాయి.
4. నాగార్జునకొండ – సమగ్ర సాంస్కృతిక నగరం:
-
ఇది కేవలం ధార్మిక ప్రదేశంగానే కాక, మఠాలు, నీటిట్యాంకులు, సభాహాలులు, శాసనాలతో కూడిన శాస్త్రీయ నగరంగా అభివృద్ధి చెందింది.a
5. విష్ణుకుండినుల కాలం – గుహా దేవాలయ నిర్మాణం:
a. 
మొగల్రాజపురం, రామతీర్థం, ఉండవల్లి గుహలు, అక్కన్న-మదన్న గుహలలో శివుడు, విష్ణువు విగ్రహాలు కనిపిస్తాయి.
b. ఇది హిందూ దేవాలయ ఆరాధన వైపుగా మారుతున్న దిశను సూచిస్తుంది.

ముగింపు:
ప్రాచీన తెలంగాణలో భాష, సాహిత్యం, కళ, శిల్పకళల ఆధారంగా అభివృద్ధి చెందిన సామాజిక-సాంస్కృతిక మూలాలు, ప్రాంతీయ గుర్తింపుని ఆవిష్కరించాయి. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మధ్యయుగాల్లో కాకతీయులు కొనసాగించారు. చివరికి ఇది 2014లో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటానికి స్ఫూర్తిగా నిలిచింది.

Additional Embellishment: