There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
తెలంగాణలో గోండులు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి ప్రధాన తెగలతో కలిపి రాష్ట్ర జనాభాలో 9.3% గిరిజనులు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో గిరిజనాభివృద్ధి అనేది కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది. రాజ్యాంగ హామీలు ఉన్నప్పటికీ, భూముల అన్యాక్రాంతం, తక్కువ మానవాభివృద్ధి సూచికలు, సాంస్కృతిక వెనకబాటుతనం వంటి వ్యవస్థాగత అడ్డంకులు గిరిజన సంక్షేమంపై చూపుతున్న ప్రభావాన్ని, విధాన అమలును లోతుగా పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి .
విషయం:
A. తెలంగాణలో గిరిజన జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లు:
1. భౌగోళిక విచ్ఛిన్నత
-భద్రాద్రి, ఆదిలాబాద్, ములుగు వంటి కొండ-అడవి ప్రాంతాల్లోని దూరప్రాంత నివాసాలకు రహదారులు, డిజిటల్ అనుసంధానం, ఆరోగ్య సేవలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు.
2. విద్యా లోటు
-గిరిజన అక్షరాస్యత రాష్ట్ర సగటు 72.8%తో పోలిస్తే 48.4% మాత్రమే ఉంది. పేదరికం, దూరం, భాషా అడ్డంకుల కారణంగా విద్యార్థులు చదువు మానేసే అవకాశం ఎక్కువగా ఉంది.
3. ఆరోగ్య సమస్యలు
-గిరిజన మహిళల్లో రక్తహీనత 68% ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు అరుదుగా ఉంటాయి. తద్వారా శిక్షణ లేని సాంప్రదాయ వైద్యులపై ఆధారపడతారు.
4. భూమి మరియు జీవనోపాధి అభద్రత
-అటవీ హక్కుల చట్టం (FRA, 2006) అమలులో జాప్యం, పోడు భూములకు సంబంధించిన పరిష్కారం కాని సమస్యలు వంటివి జీవనాధారం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
5. సాంస్కృతిక వెనుకబాటుతనం & పాలన లోపాలు
-పరిపాలనలో గిరిజనుల కోసం రూపొందించే విధానాలలో గిరిజన నాయకులతో సంప్రదింపులు లేకపోవడం, అలాగే గిరిజనుల సాంస్కృతిక వెనుక బాటతనం వంటివి ఈ తెగలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తుంది.
B. గిరిజన సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ విధానాలు:
1. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ITDAలు)
-9 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పనిచేస్తూ, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, నీటిపారుదలకు సంబంధించిన సేవలను అందిస్తున్నాయి. 2. గిరిజన ఉప-ప్రణాళిక (TSP)
-2023-24 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రం 9.08% నిధులను ST-కేంద్రీకృత అభివృద్ధికి కేటాయించింది, దీనిని ప్రత్యేక TSP పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తారు.
3. ఆశ్రమ పాఠశాలలు & ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (EMRS)
-23 EMRS సంస్థలు ఉచిత వసతి గృహ విద్యను సమగ్ర అభ్యాస సహాయంతో అందిస్తున్నాయి.
4. సంచార ఆరోగ్య విభాగాలు & ఆయుష్ సమీకరణ
-అంతర్గత ప్రాంతాలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తూ, సాంప్రదాయ వైద్య విధానాలకు మద్దతు ఇస్తున్నాయి.
5. జీవనోపాధి మిషన్లు & NGO భాగస్వామ్యాలు
-TRICOR, చెంచు జీవనోపాధి ప్రణాళికలు వంటి కార్యక్రమాలు నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక బృందాలు, గిరిజన చేతిపనుల సంరక్షణపై దృష్టి సారిస్తున్నాయి.
ముగింపు
గిరిజన ఉప-ప్రణాళిక (TSP), సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ITDAలు), ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (EMRS) వంటి పథకాలు ఫలితాలను మెరుగుపరిచినప్పటికీ, సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. అటవీ హక్కుల చట్టం (FRA) అమలును బలోపేతం చేయడం, NGO-ప్రభుత్వ సహకారాన్ని ప్రోత్సహించడం వంటివి తెలంగాణలో సమ్మిళిత, స్థిరమైన గిరిజనాభివృద్ధికి కీలకమైన అంశాలుగా మారతాయి.