There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
భారతదేశం ప్రపంచ జీవవైవిధ్యంలో 8% కంటే ఎక్కువ భాగం కలిగి ఉండి, ప్రపంచంలోని పది అత్యంత వైవిధ్యమైన దేశాలలో ఒకటిగా నిలుస్తుంది. అయితే, పెరుగుతున్న మానవ నిర్మిత ఒత్తిళ్ల కారణంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972, జీవవైవిధ్య చట్టం, 2002 వంటి చట్టాల ద్వారా, అలాగే 15వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం (భూమిపై జీవనం)తో సమన్వయం ద్వారా తక్షణ సంరక్షణ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి.
విషయం:
A. సమృద్ధ జీవవైవిధ్యానికి కారణాలు:
1. జీవభౌగోళిక వైవిధ్యం:
-భారతదేశంలోని పది మండలాలు (ఉదా., హిమాలయాలు, పశ్చిమ కనుమలు) సింహపుచ్చ మకాక్, హంగుల్ వంటి స్థానిక జాతులను కలిగి ఉన్నాయి.
2. వాతావరణ మరియు భూ వైవిధ్యం:
-కేరళలోని ఉష్ణమండల ప్రాంతం నుండి లడఖ్ వంటి ఎత్తైన పర్వతాల వరకు ఉన్న ప్రాంతాలు 16 రకాల అడవులను కలిగి ఉన్నాయి (చాంపియన్ & సేత్ వర్గీకరణ).
3. చిత్తడి నేలలు మరియు తీర పర్యావరణ వ్యవస్థలు:
-సుందర్‌బన్ అడవులు, చిల్కా, మన్నార్ గల్ఫ్ వంటి ప్రాంతాలు డుగాంగ్, ఆలివ్ రిడ్లీ తాబేళ్ల వంటి జాతులకు ఆవాసంగా ఉన్నాయి.
4. సాంప్రదాయ జ్ఞానం మరియు పవిత్ర అడవులు:
-మేఘాలయ, తమిళనాడులోని ఆచారాలు స్థానిక మొక్కలు మరియు జంతువులను సంరక్షిస్తాయి. ఇది సంస్కృతి-పర్యావరణ సంబంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
5. వ్యవసాయ జీవవైవిధ్యం మరియు స్థానిక జాతులు:
-నవర బియ్యం, పుంగనూరు ఆవు, బన్ని గేదె వంటి రకాలు పర్యావరణ సుసంపన్నతను పెంచుతాయి.
B. సహజ వనరులకు ప్రధాన ముప్పు:
1. ఆవాస విచ్ఛిన్నత:
-జాతీయ రహదారులు, నగరీకరణ (ఉదా., NH-7 పెంచ్ పులి కారిడార్‌ను విభజించడం) వల్ల జరుగుతుంది.
2. వేట మరియు అక్రమ వ్యాపారం:
-పాంగోలిన్, పులి, ఖడ్గమృగం వంటి జాతులను వేటాడడం పై చట్టపరమైన నిషేధాలు ఉన్నప్పటికీ ఈ జాతులే లక్ష్యంగా వేటలు జరుగుతున్నాయి.
3. పరాయి ఆక్రమణ జాతుల:
-లంటానా, పార్థీనియం, ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ వంటివి స్థానిక వృక్షజాలం మరియు జలచర జాతులను స్థానభ్రంశం చేస్తాయి.
4. కాలుష్యం మరియు అతివినియోగం:
-పురుగుమందుల ప్రవాహం, గనుల తవ్వకం, పర్యాటకం వంటివి అడవులు మరియు తడి భూములను దెబ్బతీస్తాయి.
5. వాతావరణ మార్పు ప్రభావాలు:
-పగడాల తెల్లబడటం, హిమనదీయ తిరోగమనం, అడవి మంటలు ( కార్చిచ్చులు) వంటివి ఆవాసాలను మరియు జాతుల విస్తరణ పై ప్రభావం చూపుతాయి.
C. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని సంరక్షణ చర్యలు
1. చట్టపరమైన రక్షణలు:
-వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972), అటవీ సంరక్షణ చట్టం (1980), జీవవైవిధ్య చట్టం (2002) వంటి చట్టాల అమలు.
2. రక్షిత ప్రాంతాలను గుర్తించడం:
-106 జాతీయ ఉద్యానవనాలు, 567 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 18 బయోస్పియర్ రిజర్వులు (MoEFCC 2023) పై విధంగా అడవులను గుర్తించడం ద్వారా అక్కడ ఉండే వృక్షజాతులు జంతుజాలాలను రక్షిస్తున్నారు.
3. ముఖ్య సంరక్షణ కార్యక్రమాలు:
-ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ డాల్ఫిన్, CAMPA, గ్రీన్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 4. సంఘం ఆధారిత నమూనాలు:
-ఉమ్మడి అటవీ నిర్వహణ (JFM), పర్యావరణ అభివృద్ధి కమిటీలు, జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు (BMCs) నిర్వహిస్తున్నారు. 5. ఆధునిక పర్యవేక్షణ సాధనాలు:
-GIS, M-STrIPES, కెమెరా ట్రాప్‌లు, e-DNA వంటివి ఆవాస పర్యవేక్షణ మరియు వేట నిరోధంలో ఉపయోగపడతాయి.
ముగింపు
భారతదేశ జీవవైవిధ్యం పర్యావరణ భద్రత మరియు సుస్థిర జీవనోపాధులను నిర్ధారిస్తుంది. వీటి సంరక్షణలో క్షేత్ర స్థాయి ప్రణాళిక, సంఘాల నాయకత్వం, సాంకేతికత వంటివి చేర్చాలి. 15వ సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో ఏకీకృతం చేయడం అనేది భారతదేశ వాతావరణం మరియు అభివృద్ధి ఎజెండాకు కేంద్రంగా ఉండాలి.