There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
భారతదేశ ఋతుపవనాలు, ఐటీసీజెడ్ (అంతర-ఉష్ణమండల కలయిక ప్రాంతం) ఆటంకాలు, టిబెట్ వేడిమి, మరియు జెట్ ప్రవాహాల వైవిధ్యం పై ఆధారపడతాయి. ఇవి సంవత్సరానికి 75% వర్షపాతాన్ని అందిస్తూ, 60% విత్తన ప్రాంతాన్ని స్థిరంగా ఉంచుతుంది. భారత వాతావరణ శాఖ (IMD) యొక్క 2023 నైఋతి రుతుపవన నివేదిక ప్రకారం, ఎల్ నీనో మరియు లా నీనా వంటి ఎన్ఎస్ఓ దశలు వర్షాకాల తీవ్రతను గణనీయంగా మార్చుతూ- తరచూ కరువులు, అతివృష్టి, అనావృష్టి వంటి సంఘటనలను ప్రేరేపిస్తాయి.
విషయం:
A. భారతీయ ఋతుపవనాల యంత్రాంగం:
1. ఉష్ణోగ్రతలో మార్పు:
-ఉత్తర భారతదేశంలో వేసవి వేడిమి అల్పపీడన కేంద్రాన్ని సృష్టిస్తుంది. అలాగే ఈ సమయంలో చల్లని సముద్రాలు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి.
2. ITCZ కదలికలు:
-అంతర-ఉష్ణమండల కలయిక ప్రాంతం జూన్ నాటికి గంగా సింధు మైదానం వైపు ఉత్తర దిశగా స్థానభ్రంశం చెందుతుంది.
3. జెట్ ప్రవాహాల పాత్ర:
-ఉప-ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహాలు వెనుకకు వెళ్లిపోతూ, ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహాలు భారత ద్వీపకల్పంపై బలపడుతాయి.
4. సముద్ర ప్రభావం:
-సోమాలి జెట్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు (SSTలు), మరియు బంగాళాఖాతంలోని అల్ప తీవ్రత గల కేంద్రాలు రుతుపవనాలకు శక్తినిస్తాయి.
5. ఒరోగ్రాఫిక్ ప్రభావాలు:
-పశ్చిమ కనుమలు 300 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతాయి. ఇదే సమయంలో మరాఠ్వాడా (వర్ష ఛాయ ప్రాంతం) ఎడారిగా (50 సెం.మీ.) మిగిలిపోతుంది.
B. భారతీయ ఋతుపవనాలపై ఎల్ నీనో ప్రభావం:
1. బలహీన ఉష్ణ ప్రసరణ:
-తూర్పు పసిఫిక్ వేడెక్కడం వాకర్ ప్రవాహాలను బలహీనపరుస్తుంది. ఇది రుతుపవనాల అల్ప తీవ్రత గల కేంద్రాలను ప్రభావితం చేస్తుంది.
2. ఆలస్యం & బలహీనమైన ఆరంభం:
-2023లో 7 రోజుల ఆలస్యం కనిపించింది. దీంతో పంజాబ్, ఒడిశాలలో వ్యవసాయ కార్యకలాపాలు అడ్డంకులకు గురయ్యాయి. 3. కరువు హెచ్చు:
-భారతదేశంలో 60% కరువులు ఎల్ నీనో సంవత్సరాలతో సమానంగా ఉంటాయి (IMD, 2023).
4. ప్రాంతీయ ప్రభావం:
-మధ్య భారతదేశం, తెలంగాణ, మరాఠ్వాడా వర్షపాత లోటు మరియు భూగర్భ జలాల తక్కువ లభ్యతనుఎదుర్కొంటాయి.
5. విధాన పరిణామాలు:
-PMFBY (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) దావాలు పెరుగుతాయి. ఖరీఫ్ పంట వైఫల్యం వల్ల ఆహార ద్రవ్యోల్బణం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది.
C. భారతీయ ఋతుపవనాలపై లా నీనా ప్రభావం:
1. బలమైన వర్షాలు: · ఇది ఋతుపవనాలను బలపరుస్తుంది. దీంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని సంభవిస్తుంది (ఉదా., 2022: LPA యొక్క 110–120%).
2. వరద ప్రమాద మండలాలు: · అస్సాం, బీహార్, ఉత్తరాఖండ్‌లో నదీ వరదలు సంభవిస్తాయి. ఉదాహరణకు, బ్రహ్మపుత్ర నది వరదలు.
3. తుఫానులు: · 2020–22 సంవత్సరాలలో లా నీనా దశలో గులాబ్, యాస్ వంటి తుఫానులు వచ్చాయి.
4. వ్యవసాయ నష్టం:
-ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో నీటి ముంపు వల్ల వరి పంటలు దెబ్బతింటాయి. అలాగే తెగుళ్ల వ్యాప్తి పెరుగుతుంది.
5. ప్రాదేశిక వైపరీత్యం:
-తూర్పు & ఈశాన్య భారతదేశం వరదలతో మునిగిపోతున్న ఇదే సమయంలో వాయవ్య భారతదేశం పొడిగా ఉంటుంది. ఇది విభజన అసమానతలను సృష్టిస్తుంది.
ముగింపు:
భారతదేశం దాదాపు ప్రతి 5 సంవత్సరాలలో 2 సార్లు కరువును ఎదుర్కొంటుంది, దీనికి ఎల్ నీనో సంఘటనలు 60% కంటే ఎక్కువగా కారణం అవుతాయి. జాతీయ స్థిర వ్యవసాయ మిషన్ (NMSA)లో వివరించిన వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, వాతావరణ అనుకూల ప్రణాళిక, కరువు-నిరోధక పంటలు, మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా, వర్షాకాల అనిశ్చితత్వం పెరుగుతున్న నేపథ్యంలో జీవనోపాధిని సురక్షితం చేయడం ఎంతగానో అవసరం.