There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sat May 10, 2025
పరిచయం:
మధ్యయుగ తెలంగాణలో ఏర్పడిన మిశ్రమ సంస్కృతి అనేది తెలుగు ప్రాంతీయ సంప్రదాయాలు మరియు కుతుబ్‌షాహీ పాలకులచే తీసుకువచ్చిన పర్షియన్-ఇస్లామిక్ ప్రభావాల పరస్పర కలయిక ఫలితంగా రూపొందింది. ఇది కాకతీయులు మరియు బహమనీల సాంస్కృతిక వారసత్వాలపై ఆధారపడి, పరిపక్వమైన రూపాన్ని పొందింది. ఈ సంస్కృతి పరస్పర సౌందర్య భావన, పరిపాలనా విధానాలు, మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల కలయికతో ఒక ప్రత్యేకమైన. విషయం:
విషయం:
ప్రాంతీయ గుర్తింపును పొందింది. మధ్యయుగ తెలంగాణలో మిశ్రమ సంస్కృతి అభివృద్ధి:
1. భాషా సమన్వయం:
a. రాజ్య భాషగా పర్షియన్‌ను స్వీకరించగా, తెలుగు సాహిత్యరంగంలో కొనసాగింది.
b. తెలుగు మరియు దక్కని ఉర్దూ భాషలలో రచనలు, శాసనాలు ప్రచురితమయ్యాయి. ఉదాహరణకు: కుతుబ్‌షాహీ చరిత్రలో దక్కని ఉర్దూ మరియు తెలుగు పత్రాల ఉనికి కనిపిస్తుంది.
c. క్షేత్రయ్య వంటి తెలుగు కవులు పర్షియన్, ఉర్దూ కవులకు సమకాలీనులుగా ఉండడం అనేది కళాకారుల ఆధ్యాత్మిక మేళవింపుకు నిదర్శనం.
2. శిల్పకళా సంగమం:
a. గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులు వంటి ఇండో-ఇస్లామిక్ నిర్మాణాల్లో పర్షియన్ గోపురాలు, దక్కనీ అలంకారాలు కలిసిన రూపాలు కనిపిస్తాయి.
b. స్థానిక గ్రానైట్ రాయి, అలంకరణలు, మరియు పర్షియన్ తోటల శైలి కలిసి దృశ్యకళను పరిపుష్టం చేశాయి.
3. ధార్మిక-ఆధ్యాత్మిక పరస్పర వినిమయం:
a. సూఫీ దర్గాలు మరియు ఆలయాలు సమకాలీనంగా ఉండటం వల్ల మతాల మధ్య సంస్కృతుల కలయికకు దోహదపడింది. b. షేఖ్ రాజు కత్తాల్ వంటి సూఫీ గురువులు స్థానిక విశ్వాసాలను ప్రభావితం చేశారు. ఇదే సమయంలో వీరశైవము, వైష్ణవ సాంప్రదాయాలు కూడా అభివృద్ధి చెందాయి.
4. రాజసభ సాంస్కృతిక పద్ధతులు మరియు పండుగల మేళవింపు:
a. అంగర్క్ఖా, షేర్వానీ వంటి వేషధారణ, పర్షియన్ సంగీతం, భోజనపద్ధతులు స్థానిక సంప్రదాయాల్లో కలిసిపోయాయి.
b. బోనాలు వంటి ప్రజాపండుగలు ముహర్రం వంటి ఇస్లామిక్ వేడుకలతో కలిసి జరగడం అనేది రెండు సంస్కృతుల మధ్య అనుబంధాన్ని చూపిస్తుంది.
5. పరిపాలన మరియు సామాజిక ప్రభావం:
a. ఆదాయ విధానాలు పర్షియన్ పాలనా విధానాలపై ఆధారపడినప్పటికీ దేశ్ముఖ్ వంటి పద్ధతులు కూడా కొనసాగాయి (ఉదా: ఆయిని-అక్బరీ ప్రభావం).
b. కుతుబ్‌షాహీ పాలనలో హిందువులను ఉన్నత పదవుల్లో నియమించడం, ముఖ్యంగా అక్కన్న-మదన్నల ఉన్నత పదవులు ఈ సమ్మిళిత సంస్కృతికి నిదర్శనం.
c. బహమనీ మరియు కుతుబ్‌షాహీ రాజ్యాలలో నాయకులు, స్థానిక పెద్దలు మరియు పర్షియన్ మూలాల ఉన్నతవర్గీయులు సమాంతరంగా పనిచేశారు.
ముగింపు
తెలంగాణలో మధ్యయుగంలో అభివృద్ధి చెందిన ఈ సమ్మిళిత సంస్కృతి నిజంగా గంగా-జమునా తహజీబ్‌కు ప్రతీక. ఇది సామరస్యభావం మరియు బహుళత్వ స్ఫూర్తికి పునాదిగా నిలిచి, ఆసఫ్‌జాహీ రాజవంశాల కాలంలోనూ కొనసాగింది. ఈ విధంగా, తెలంగాణ బహుళ సాంస్కృతులను పదిలంగా కొనసాగించిన ప్రత్యేక భూమిగా నిలిచింది.