TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Tue Jul 1, 2025

Q. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో జరిగిన కొత్తగూడెం నిరసనలు మరియు రవీంద్రనాథ్ యొక్క ఉపవాస దీక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే ఈ సంఘటనలు ప్రజా సమీకరణను ఎలా ప్రభావితం చేశాయి?

పరిచయం:
1969 ఆరంభంలో కొత్తగూడెం నిరసనలు మరియు రవీంద్రనాథ్ యొక్క నిరాహార దీక్ష తెలంగాణలో వ్యవస్థీకృత వివక్షకు వ్యతిరేకంగా నిలిచాయి. ఈ సంఘటనలు 1956 తర్వాత పెరిగిన ఉపాధి అన్యాయాన్ని బహిర్గతం చేశాయి. ఇవి విద్యార్థులు, కార్మికులు మరియు నిరుద్యోగ యువతలో విస్తృతమైన ప్రజా సమీకరణకు ఉత్ప్రేరకంగా పనిచేశాయి.

విషయం:
I. కొత్తగూడెం నిరసనలు మరియు వాటి ప్రాముఖ్యత

A. మూలాలు మరియు ప్రధాన ఫిర్యాదులు
1. కొత్తగూడెం నిరసనలు 1960లో స్థాపించబడిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS)లో ఉపాధి అన్యాయాల నుండి ఉద్భవించాయి.
2. ఇది తెలంగాణలో ఉన్నప్పటికీ, 1,400 మంది కార్మికులలో కేవలం 200 మంది మాత్రమే ఈ ప్రాంతానికి చెందినవారు.
3. 1968లో, 175 మంది తెలంగాణ స్థానిక కార్మికులు తొలగించబడ్డారు. ఇది స్థానిక కార్మిక శక్తిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
4. కార్మికులు స్థానిక యువతకు న్యాయమైన ఉద్యోగ విభజనను నిర్ధారించడానికి ముల్కీ నిబంధనల ఖచ్చితమైన అమలును డిమాండ్ చేశారు.
5. కొత్తగూడెంకు చెందిన నాయకుడు కె. రామదాసు, విద్యార్థి నాయకుడు అన్నబత్తుల రవీందర్ ద్వారా నిరాహార దీక్ష ప్రారంభించి తెలంగాణ హక్కుల కోసం తన ఆవేదనను వ్యక్తపరిచారు.

B. కార్మికులు మరియు విద్యార్థుల సమీకరణ
1. కొత్తగూడెం నిరసనలు కార్మికులు నడిపినప్పటికీ, తెలంగాణ నాన్-గజెటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వంటి విద్యార్థి సంఘాలు ప్రజలను సమీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
2. రవీంద్రనాథ్ ఉపవాసం విస్తృతమైన మీడియా దృష్టిని, జాతీయ మద్దతును పొందింది.
3. టి. పురుషోత్తం రావు వంటి నాయకులు నడిపిన తెలంగాణ సేఫ్‌గార్డ్స్ ఆందోళన సంఘం, ఖమ్మం ప్రాంతంలో ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.
4. ఈ నిరసనలు తెలంగాణ అంతటా విద్యార్థి, రాజకీయ చైతన్యానికి ఆజ్యం పోసి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లాయి.

II. రవీంద్రనాథ్ నిరాహార దీక్ష మరియు సమీకరణలో దాని పాత్ర
A. త్యాగ సంకేతంగా రవీంద్రనాథ్ ఉపవాస దీక్ష
1. 1969లో, ప్రముఖ విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్, ముల్కీ నిబంధనల అమలు, న్యాయమైన నియామకాల కోసం హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేపట్టారు.
2. ఆయన త్యాగం తెలంగాణ ప్రాంతంలో లోతైన అసమానతలపై దృష్టిని ఆకర్షించి, తెలంగాణ యువత అసంతృప్తిని జాతీయ దృష్టికి తీసుకొచ్చింది.
3. రవీంద్రనాథ్ చర్య 1969 తెలంగాణ ఆందోళనకు ఉత్ప్రేరకంగా నిలిచి, ఉపాధి, వనరుల కేటాయింపు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది.

B. ప్రజ సమీకరణ మరియు ప్రాంతీయ స్వతంత్రతపై ప్రభావం
1. రవీంద్రనాథ్ నిరాహార దీక్ష త్యాగ సంకేతంగా మారి, తెలంగాణ స్వరాజ్య ఆకాంక్షను, స్వాభిమానాన్ని తీవ్రతరం చేసింది.
2. "నాన్-ముల్కీ గో బ్యాక్" అనే నినాదం విస్తృత ప్రచారం పొందడంలో విద్యార్థి నిరసనలు, ఉద్యోగుల సమ్మెలు కీలకపాత్ర పోషించాయి.
3. ఈ సంఘటన ఉద్యమాన్ని విద్యార్థులు, ఉద్యోగుల నుండి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి సహాయపడింది. ఇక్కడ గ్రామస్థులు, కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు మద్దతు ఇచ్చారు.
4. రవీంద్రనాథ్ ఉపవాసం, తదనంతర నిరసనల మీడియా కవరేజీ తెలంగాణ ఫిర్యాదులను జాతీయ, అంతర్జాతీయ దృష్టిలోకి తీసుకొచ్చాయి.

III. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొత్తగూడెం నిరసనల పాత్ర
A. విస్తృత రాజకీయ సమీకరణకు ప్రేరణ

1. కొత్తగూడెం నిరసనలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రారంభ ఉత్ప్రేరకంగా నిలిచాయి.
2. విద్యార్థుల ఉత్సాహం, ఉద్యోగుల సమ్మెలు పెరిగాకా, తెలంగాణ ప్రజా సమితి (TPS), రాష్ట్ర ఆకాంక్షకు రాజకీయ శాఖగా ఆవిర్భవించింది.
3. 1971 ఎన్నికలలో TPS తెలంగాణలో గణనమైన విజయం సాధించడానికి ఈ నిరసనలు కూడా ఒక కారణం.

B. తెలంగాణ స్వాతంత్య్ర, రాజకీయ కార్యక్రమ అభివృద్ధి
1. విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలు ఉద్యోగ ఫిర్యాదులకే పరిమితం కాకుండ, స్వపరిపాలన కోసం రాజకీయ ఉద్యమంగా విస్తరించిన ఏకీకృత ప్రాంతీ స్వతంత్రాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి.
2. కొత్తగూడెం నిరసనలు, రవీంద్రనాథ్ ఉపవాసం భవిష్యత్ పోరాటాలకు మార్గం ఏర్పరిచి, తెలంగాణ న్యాయమైన ప్రాతినిధ్యం కోసం జాతీయ రాజకీయ సంభాషణలో భాగం కావడానికి దారి చూపాయి.

ముగింపు
 కత్తగూడెం ఆందోళన మరియు రవీంద్రనాథ్ ఉపవాసం దీక్ష, విచ్ఛిన్న ఫియాదులను సామూహిక రాజకీయ చైతన్యంగా మార్చిన కీలక భూమికగా నిలిచాయి. గౌతం పింగళె ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణలో చెప్పినట్లు, "1969 అనేది తెలంగాణలో నిరాకరించబడిన న్యాయం, మరియు చేయబడిన వాగ్దానాల అగ్నిలోతులో రూపొందిన క్షణం.